పాకిస్తాన్ ఆటగాడైనా.. నిజంగా అతన్ని మెచ్చుకోవాల్సిందే?
ఈ క్రమంలోనే ప్రత్యర్థి జట్టు ఆటగాడు అయినప్పటికీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ పై ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా వికెట్ కోల్పోయిన సమయంలో కొంత మంది ఆటగాళ్లు క్రీజులో నిలబడుతూ ఉంటారు.. అంపైర్ ఏం నిర్ణయం తీసుకుంటారా అని వేచి చూస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం అంపైర్ అవుట్ ఇవ్వకపోయినప్పటికీ ఇక తాము అవుట్ అయ్యాము అన్న విషయం తెలిసి వెంటనే క్రీజు ను వదిలి వెళ్ళి పోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటిది జరిగింది.
పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆరవ ఓవర్ సమయంలో ఆవేశ్ ఖాన్ బౌలింగ్ వేశాడు. అప్పటికే రెండు ఫోర్లు బాది జోరుమీద ఉన్నాడు ఫకర్ జమాన్. ఆవేశ్ ఖాన్ వేసిన ఐదో బంతి షాట్ పిచ్ కాగా బంతి బౌన్స్ అయ్యింది. ఇక బంతి మిస్ చేసుకోగా బంతి కీపర్ చేతుల్లోకి పడింది. ఇక ఎలాంటి శబ్దం వినిపించకపోవడం తో ఎవరు కూడా వికెట్ కోసం అప్పీల్ చేయలేదు. కానీ ఇలాంటి నేపథ్యంలోనే ఫకర్ జమాన్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ అంపైర్ సిగ్నల్ ఇచ్చే వరకు వేచి చూడకుండా పెవిలియన్ బాట పట్టాడు. మహమ్మద్ రిజ్వాన్ ఆలోచించమని చెప్పినా కూడా వినకుండా ఫకర్ జమాన్ వెళ్ళిపోయాడు అని చెప్పాలి. ఆ తర్వాత రిప్లై లో చూసుకుంటే బ్యాట్ కి బంతి స్ట్రైక్ అయినట్లు తేలింది.