భారత్ గెలిచినప్పుడు.. జై షా అందుకే జాతీయ జెండా తీసుకోలేదట?

praveen
ఇటీవలే ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎంతో హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ఉత్కంఠభరితమైన పోరులో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే భారత జట్టు విజయానికి తమ ప్రదర్శనతో తోడ్పాటు అందించిన ఆటగాళ్లు అందరి పై కూడా ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఎంతోమంది మాజీ ఆటగాళ్లు. అయితే పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు ప్రదర్శన ఎంత హాట్ టాపిక్ గా మారిపోయిందో.. డగౌట్ లో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న సెక్రెటరీ జైషా చేసిన పని కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


  ఆయన చేసిన పని తీవ్ర దుమారం రేపింది అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో అయితే రాజకీయ విమర్శలకు ఇది ఒక కారణంగా  మారిపోయింది.  జాతీయ లీడర్ల నుంచి చిన్న చిన్న లీడర్ల వరకు అందరూ ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏం జరిగిందంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీగా ఉన్న జై షా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. హై ఓల్టేజ్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. స్టేడియంలో ప్రేక్షకులు జాతీయ జెండాలు పట్టుకుని సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడి హోదాలో ఇతర క్రికెట్ బోర్డు అధికారులతో కలిసి మ్యాచ్ వీక్షించిన జై షా భారత్ గెలవడంతో  తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చప్పట్లతో ఆటగాళ్లను  అభినందించారు.  ఇందులో భారత్కు చెందిన ఒక వ్యక్తి జాతీయ జెండాను జైషా కు ఇచ్చే ప్రయత్నం చేయగా అందుకు జై షా సున్నితంగా తిరస్కరించారు. ఈ వీడియో వైరల్గా మారిపోవడంతో ఎంతోమంది విమర్శలు చేశారు. భారతదేశ జాతీయ జెండాను జై షా తీసుకోక పోవడం వెనుక బలమైన కారణం ఉందని.. అతను బీసీసీఐ సెక్రటరీ హోదాలో కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా మ్యాచ్ కు హాజరయ్యారు. అందుకే భారత జెండా తీసుకోలేకపోయారు ఈ విషయం తెలుసుకొని విమర్శలు గుప్పించాలి అని అతని సన్నిహితులు అభిమానులు సూచిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: