17ఏళ్ల ప్రయాణం ముగిసింది.. క్రికెటర్ ఎమోషనల్?
కానీ ఇటీవలే ఆదిత్య తారే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి ముంబై తరఫున ఆడబోను అంటూస్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే ముంబై క్రికెట్ అసోసియేషన్ తో ఉన్న 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అయితే వచ్చే సీజన్ నుంచి మాత్రం రంజీ ట్రోఫీలో భాగంగా ఆదిత్య ఉత్తరాఖండ్ జట్టు తరపున ఆడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే డొమెస్టిక్ సీజన్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 47 మంది సీనియర్ క్రికెటర్ల లిస్టులో ఆదిత్య పేరు కనిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ముంబై క్రికెట్ అసోసియేషన్ తో అతని బంధం ముగిసింది అన్న వార్తలు గుప్పుమన్నాయి.
ఇక ఇటీవలే ఇదే ఈ విషయంపై స్వయంగా స్పందించాడు ఆదిత్య తారే. ముంబై జట్టు తో ఉన్న 17 ఏళ్ల బంధం నేటితో ముగిసింది. ముంబై నుంచి వెళ్ళిపోతున్న అనే పదం నాకు బాధను కలిగిస్తుంది. కానీ అది ఎలా వివరించాలో అర్థం కావడం లేదు. 17ఏళ్ల వయసులో అండర్ 17 విభాగంలో ముంబైకి తొలిసారి ప్రాతినిధ్యం వహించాను. అప్పటి నుంచి 17ఏళ్ల పాటు ముంబై తరఫున దేశవాళీ టోర్నీలో పాల్గొనడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఇక ఎన్నో విషయాలు విమర్శలు వైఫల్యాలను కూడా చూశాను. జట్టులో సహచరులతో గడిపిన క్షణాలు ఎప్పటికీ నాకు ఒక మంచి జ్ఞాపకాలే అంటూ ఒక భావోద్వేగంతో కూడిన నోట్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు తారే
.