అందరూ అదరగొడుతుంటే.. అతను మాత్రం భారంగా మారుతున్నాడా?

praveen
ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగా అతను టీమిండియా జట్టులో త్వరగానే అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే బిసిసీఐ  సెలక్టర్లు అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే మిని ప్రపంచ కప్ గా పిలవబడే ఆసియా కప్ లో కూడా టీమిండియా తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఇలా వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ తనని తాను నిరూపించుకోవడంలో  మాత్రం అతను విఫలమవుతున్నాడు.   ఆ బౌలర్ ఎవరో కాదు ఆవేష్ ఖాన్.  మొన్నటికి మొన్న పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో ఎంతో ఖరీదైన ఆటగాడిగా పేలవ  ప్రదర్శనతో నిరాశపరిచాడు.


 ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ యాజమాన్యం అతని పక్కన పెట్టలేదు.  హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అతనికి తుది జట్టులో అవకాశం కల్పించింది. కానీ పసికూన హాంకాంగ్ మీద కూడా అతను మళ్ళీ దారుణ  ప్రదర్శన చేశాడు. అతని బౌలింగ్లో హాంకాంగ్ బ్యాట్స్మెన్లు ఎంతో అలవోకగా పరుగులు చేశారు.  దీంతో అతని ఫ్లాప్ ప్రదర్శన కాస్త టీమిండియాకు భారంగా మారిపోతుంది అని చెప్పాలి. జట్టులో ఉన్న బౌలర్లు పరుగులను కట్టడి చేస్తూ ఉంటే వాళ్ళు కట్టడి చేసిన పరుగులను ఆవేష్ ఖాన్ సమర్పించుకున్నాడు.


 ఆసియా కప్ లాంటి ఒక పెద్ద వేదిక లో కూడా అవకాశం దక్కించుకున్నప్పటికీ ఎందుకో  తనని తాను మెరుగుపరచుకోలేక పోతున్నాడు  ఆవేష్ ఖాన్. హాంకాంగ్ పై నాలుగు ఓవర్లు వేశాడు. అందులో హాంకాంగ్ బ్యాట్స్ మెన్ లను  కూడా కట్టడి చేయలేకపోయారు. 13.25 ఎకానమితో 53 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇలా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అత్యంత ఖరీదైన బౌలర్ గా ఆవేష్ ఖాన్ ప్రదర్శన చేశాడు. ఇక అంతకుముందు కూడా టీమిండియా ఆడిన మ్యాచ్ లలో సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. అయినప్పటికీ అతనిపై నమ్మకం ఉంచిన జట్టు యాజమాన్యం అవకాశాలు ఇస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: