దూసుకొచ్చిన అభిమాని.. కోహ్లీ చేసిన పనికి అందరూ ఫిదా?

praveen
తెలుగు హీరో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు రోజురోజుకు పెరిగి పోతూనే ఉంటారు. అచ్చంగా  ఇలాగే అటు క్రికెట్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది.  అతడు పరుగులు చేసినా చేయకపోయినా అతని ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. కేవలం స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా అతనికి బోలెడు వీరాభిమానులు ఉన్నారు అని చెప్పాలి.


 భారత దాయాది దేశమైన పాకిస్థాన్లో కూడా విరాట్ కోహ్లీ అంటే మైమరిచిపోయే వీరాభిమానులు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు పాకిస్తాన్ క్రికెట్ లో ఆటగాళ్లు  కూడా అతని జెర్సీ  తీసుకుని  సంతోషపడ్డారు అంటే ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ కి ఉన్న  పాపులారిటీ  అంతా ఇంతా కాదు అని చెప్పాలి.  ఇక విరాట్ కోహ్లీ ఒక్కసారి కలిస్తే చూడాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అదే సమయంలో అటు విరాట్ కోహ్లీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడైనా అభిమానులు పిలిస్తే వారివైపు తిరిగి అభివందనం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.


 ఇప్పుడు విరాట్ కోహ్లీ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇటీవల భారత్ హాంకాంగ్ జట్ల మ్యాచ్ జరిగింది. భారత జట్టు  స్టేడియం లోకి వెళ్తుండగా ఒక బాలుడు  సెక్యూరిటీ కళ్లుగప్పి కోహ్లీ దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ సెక్యూరిటీ అతని పట్టుకొని ముందుకు వెళ్లనివ్వలేదు. అలాంటి సమయంలో గమనించిన కోహ్లీ ఆ బాలున్నీ  దగ్గరకు పిలిపించుకొని కాసేపు ముచ్చటించి  ఆటోగ్రాఫ్ ఇచ్చి సెల్ఫీ దిగి పంపించాడు. ఇది చూసిన అభిమానులు  అందరూ కేవలం ఆటలోనే కాదు అటు  గొప్ప మనసు చాటుకోవడం లోను  కోహ్లీ కింగే కింగే అంటూ  కామెంట్లు చేస్తున్నారు. వీడియో  ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: