ఇది కదా మ్యాచ్ అంటే.. తీవ్ర ఉత్కంఠ మధ్య లంక విజయం?

praveen
ప్రస్తుతం మినీ వరల్డ్ కప్ గా పేరుగాంచిన ఆసియా కప్ క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఆసియా కప్లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు కూడా ఎవరు విజయం సాధిస్తారో తెలియక ప్రేక్షకులు అందరూ కూడా కన్ఫ్యూషన్ లో  ఉంటున్నారు.   కన్నార్పకుండా  మ్యాచ్ వీక్షిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే ఆసియా కప్లో భాగంగా శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇలా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. ఓటమి ఖాయం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పుంజుకున్న  శ్రీలంక జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి.


 ఇక ఈ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా చివరి వరకు ఏం జరుగుతుందో తెలియక కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. అందరిని ఒక్కసారిగా స్టన్  అయ్యేలా  చేసింది ఈ మ్యాచ్ అని చెప్పాలి.  ఎందుకంటే దాదాపు శ్రీలంక ఓడిపోవడం ఖాయం అని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా శ్రీలంక విజయం సాధించి సూపర్ 4 లోకి అడుగుపెట్టింది.  బంగ్లాదేశ్తో జరిగిన గ్రూప్-డి మ్యాచ్లో భాగంగా శ్రీలంక రెండు వికెట్ల తేడాతో విజయం సాధించడం గమనార్హం. చివరి రెండు ఓవర్లలో గెలుపుకోసం 25 పరుగులు కావాల్సి ఉంది. అప్పటికే అందరూ బ్యాట్స్మెన్లు అవుటయ్యారు. కేవలం బౌలర్లు మాత్రమే బ్యాటింగ్ చేస్తున్నారు.


 దీంతో శ్రీలంక ఓటమి ఖరారు అయ్యింది అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో 19 ఓవర్లో బౌలర్   17 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఇక చివరి ఓవర్లో జట్టుకు విజయాన్ని అందించేందుకు లంక బ్యాట్స్మెన్ లకు మరింత పని సులభమైంది .  ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆతర్వాత లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి టార్గెట్ చేయించింది. మ్యాచ్  మాత్రం ఉత్కంఠతో ప్రేక్షకులందరినీ మునివేళ్ళపై నిలబెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: