టీమ్ ఇండియా Vs ఆఫ్ఘనిస్తాన్.. అందరి కళ్లూ ఆమెపైనే?

praveen
ఆసియా కప్ లో భాగంగా టీమిండియా వరుస విజయాలు సాధిస్తోంది. ఇప్పటికే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై  ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఆ తర్వాత పసికూన హాంకాంగ్ పై 40 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆసియా కప్లో భాగంగా మూడో మ్యాచ్ ఆడేందుకు  సిద్ధమైంది అన్న  విషయం తెలిసిందే.  మరోవైపు ఆఫ్గనిస్తాన్ జట్టు అంచనాలకు మించి రాణిస్తూ లీగ్ దశలో శ్రీలంక బంగ్లాదేశ్ పై సంచలన విజయాలను నమోదు చేసింది. సూపర్ 4 లో అడుగుపెట్టింది.  ఇదిలా ఉంటే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక అందమైన యువతి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది.


 స్టేడియం లో ఉన్న కెమెరాలన్నీ  ఆ యువతి వైపు మళ్ళాయి. దీంతో స్టేడియంలో ఉన్నవారు టీవీల ముందు కూర్చున్న వారు  యువతిని చూసి ఫిదా అయిపోయారు. ఆ అమ్మాయి పేరు వాజ్వా ఆయుబి.  ఆఫ్ఘనిస్తాన్ అభిమాని అయిన వాజ్వా బౌండరీ లైన్  దగ్గర ఆఫ్గాన్ జెండా పట్టుకుని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను కట్టిపడేసింది.  ఇక ఆమె సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా అభిమానులు ఊరుకుంటారా.. టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కి వస్తారా అటు కామెంట్ చేయడం విశేషం..


 అయితే ఈ అమ్మడు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇండియా మధ్య జరగబోయే మ్యాచ్ కి వస్తుందో లేదో తెలియదు. కానీ ఒకవేళ వాజ్మా  హాజరైతే మాత్రం అందరి కళ్లూ ఆమె వైపే ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా సెప్టెంబర్ 4వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మరోసారి తల పడే అవకాశం ఉంది.  అదే సమయంలో సెప్టెంబర్ ఆరో తేదీన టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఈ అందాల సుందరి స్టేడియం కి వస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: