పాకిస్తాన్... "హాంగ్ కాంగ్ ను నిర్లక్ష్యం చేయొద్దు" ?

VAMSI
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొత్తం ఆరు జట్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి ఆసియా టైటిల్ కోసం పోటీ పడుతుండగా, గత రాత్రి కీలకమైన మ్యాచ్ లో శ్రీలంకతో బంగ్లాదేశ్ ఓడిపోయి ఇంటి బాట పట్టింది. తద్వారా గ్రూప్ బి నుండి ఆఫ్గనిస్తాన్ మరియు శ్రీలంకల సూపర్ 4 కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్ ఏ నుండి రెండు విజయాలతో సూపర్ 4 కు దూసుకువెళ్లింది. ఇక సూపర్ 4 కు చేరుకునే నాలుగవ జట్టు కోసం ఈ రోజు షార్జా వేదికగా ఇంకాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది.

ఇరు జట్లకు ఈ మ్యాచ్ చావో రేవో అని తెలిసిందే. అందుకే గెలుపు ప్రధాన లక్యంగా తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుని పోటీకి దిగుతున్నారు. అయితే హాంగ్ కాంగ్ పై ఎటువంటి అంచనాలు లేకున్నా... పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు. అయితే గతంలో ఉన్నంతగా ఈ జట్టు అంతగా ఫామ్ లో లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా తమ ఏస్ బౌలర్ షహీన్ ఆఫ్రిది గాయం కారణంగా ఆసియా కప్ కు దూరం కావడం టీం ను ఎంతగానో బాధిస్తోంది.

ఇక తమ జట్టు అన్ని ఫార్మాట్ లలో దూసుకుపోతున్న బాబర్ అజమ్ మొదటి మ్యాచ్ లో విఫలం కావడం, ఇక జట్టులో ఉన్న ఆల్ రౌండర్ లు స్థాయికి తగిన ప్రదర్శన చేయకపోవడం, బౌలర్లు అనుకున్నంత ఎఫెక్టివ్ గా రాణించకపోవడం వంటి అంశాలు జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ సమిష్టిగా అన్ని విభాగాల్లో రాణించి హాంగ్ కాంగ్ ను ఓడించి సూపర్ 4 కు అర్హత సాధిస్తుందా చూడాలి. హాంగ్ కాంగ్ సైతం బాగా ఆడుతోంది. ఇండియన్ తోనే అద్భుతంగా ఆడింది. అందుకే పాకిస్తాన్ ను కొందరు అభిమానులు తేలిగ్గా తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు.    




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: