కోహ్లీ కాదు.. సూర్య కుమార్ యాదవ్ బెస్ట్ : గంభీర్

praveen
గత కొంతకాలం నుంచి పేలవమైన ప్రదర్శనతో  ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే విరాట్ కోహ్లీ పుంజుకోవడానికి కొన్నాళ్ళ పాటు విశ్రాంతి ఇచ్చింది  టీమిండియా యాజమాన్యం.  ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసిన విరాట్ కోహ్లి ఇటీవలే ఆసియా కప్లో భాగంగా టీమిండియాతో చేరాడు. మునుపటి తో పోలిస్తే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పర్వాలేదనిపించాడు  అని  చెప్పాలి. పాక్ తో  మ్యాచ్లో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన  విరాట్ కోహ్లీ  హాంకాంగ్ తో మ్యాచ్ లో 59 పరుగులతో మరోసారి తన సత్తా చాటాడు అని చెప్పాలి.


 అదేసమయంలో ప్రస్తుతం కెరీర్ లోనే అద్భుతమైన ఫాంలో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ టీమిండియా విజయాన్ని అందిస్తున్నాడు.   ఇటీవల హాంగ్కాంగ్లో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లోనే 68 పరుగులు చేసి ఔరా  అనిపించాడు అని చెప్పాలి. అతను కాస్త ఆలస్యంగా బ్యాటింగ్ కి వస్తూ ఉన్నాడు.  ఇదే విషయంపై స్పందించిన మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం మూడో స్థానంలో విరాట్ కోహ్లీ కి బదులు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కి పంపితే  బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 సూర్య కుమార్ యాదవ్ ఇంకా కుర్రాడేమీ కాదని 30 ఏళ్ల వయస్సు దాటిన నేపథ్యంలో  అనుభవాన్ని ఉపయోగించుకుంటూ మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా ఆడాలో అతనికి తెలుసు అంటూ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలోనే అతను మంచి బ్యాటింగ్ చేయాలంటే దానికి తగినంత సమయం ఇవ్వాలి.. అందుకే అతన్ని వన్ డౌన్ లో  బ్యాటింగ్ కి పంపడమే కరెక్టు.. విరాట్ కోహ్లీకి  ఎంతో అనుభవం ఉంది. అతను నాలుగో స్థానంలో కూడా పుంజుకోగలడు. అందుకే  సూర్యకుమార్ యాదవ్ ను వన్ డౌన్  లో పంపి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలని గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: