ఇండియా vs పాక్.. మ్యాచ్ ఇక్కడ ఉచితంగా చూడవచ్చు?
దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇక ఈ మ్యాచ్ జరగనుంది సరిగ్గా వారం గ్యాప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లు రెండు సార్లు జరగడంతో అభిమానులు అందరూ కూడా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ మ్యాచ్ వీక్షించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అంతేకాదండోయ్ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా.. లైవ్ స్ట్రీమింగ్ చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పాలి. ఇక ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా కూడా ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. అయితే ఇవన్నీ ఫెయిడ్ చానల్స్ కావడం గమనార్హం. ఆ సమయంలోనే ఉచితంగా చూసేందుకు ఏదైనా అవకాశం ఉందా అని కూడా అందరు అనుకుంటూ ఉంటారు. దూరదర్శన్లో ఈ సౌకర్యాన్ని కల్పించింది. డిడి స్పోర్ట్స్ ఛానల్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ప్రసారం చేయబడుతుంది. నిజానికి ఆసియా కప్ టోర్నమెంట్ను డిడి స్పోర్ట్స్ ఛానల్ మొదటి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. కానీ సూపర్ ఫోర్ దశలో భారత్ మ్యాచ్ లు మాత్రమే డిడి స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉండడం గమనార్హం. డిడి స్పోర్ట్స్ ఛానల్ లో మాత్రం ఉచితంగా మ్యాచ్ చూడొచ్చు అని చెప్పాలి.