షాకింగ్ : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్?
ఇలా ఇప్పటికే నిరాశలో మునిగిపోయిన బంగ్లాదేశ్ జట్టుకు ఇటీవలే మరో భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ స్టార్ వికెట్-కీపర్ అయినా ముష్ఫికర్ రహీం టి20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు వన్డేల పై ఫోకస్ పెట్టేందుకే టి 20 నుంచి వైదొలుగుతున్నట్లు ముష్ఫికర్ రహీం చెప్పుకొచ్చాడు. టి20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నప్పటికీ అటు దేశవాళీ ఫ్రాంచైజీ క్రికెట్ కు మాత్రం అందుబాటులో ఉంటాను అంటూ స్పష్టం చేశాడు. ఒకప్పుడు బంగ్లాదేశ్ జట్టుకు అన్నీ తానై వెన్నెముకగా నిలిచిన రహీం కొన్ని రోజుల నుంచి మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు.
ఇక ఇటీవలే ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కూడా కీలకమైన సమయంలో ఒక క్యాచ్‌ను జారవిడిచి ఇక టోర్నీ నుంచి జట్టు నిష్క్రమించటానికి కారణమయ్యాడు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది బంగ్లాదేశ్ జట్టు కు ఇది రెండో షాక్ అని చెప్పాలి. ఈ ఏడాది జూలైలో సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ కూడా టీ20 లకు బై చెప్పేసాడు. రహీం కెరియర్ వివరాలు చూసుకుంటే.. 35 ఏళ్ల ముష్ఫికర్.. బంగ్లా తరఫున 82 టెస్ట్‌ల్లో 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5235 పరుగులు, 236 వన్డేల్లో 8 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీల సాయంతో 6774 పరుగులు, 102 టీ20ల్లో 115 స్ట్రయిక్ రేట్‌తో 6 హాఫ్ సెంచరీల సాయంతో 1500 పరుగులు సాధించాడు. వికెట్‌కీపింగ్‌లో రహీం అన్ని ఫార్మాట్లలో కలిపి 449 వికెట్లు పడగొట్టాడు.