ఆసియా కప్.. భారత్ ఫైనల్ వెళ్లాలంటే?

praveen
ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టు ఆసియా కప్లో భాగంగా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించి అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్లో భాగంగా  పాకిస్తాన్తో తలపడింది. ఇక ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.  కాగా ఆ తర్వాత హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేసింది టీమిండియా. ఈ క్రమంలోనే 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూపర్ ఫోర్ లో అడుగుపెట్టింది టీమిండియా.. ఈ క్రమంలోనే  సూపర్ పోరులో భాగంగా ఇటీవల మరోసారి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ మ్యాచ్లో మాత్రం కాస్త పేలవమైన ప్రదర్శన చేసిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో ఆసియా కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు బ్రేక్ పడింది అని చెప్పాలి. అయితే ఇక భారత్ ఫైనల్ వెళ్లాలంటే ఏం జరగాలి అన్న దానిపై చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సూపర్ ఫోర్ లో భాగంగా ఛాన్స్ దక్కించుకున్న నాలుగు జట్లు కూడా ఒక్కో టీం తో ఒక్కో మ్యాచ్కు ఆడతాయి.


 ఈ క్రమంలోనే టాప్ 2 లో ఉన్న రెండు టీంలు ఫైనల్కు వెళతాయి అని చెప్పాలి.ఇక భారత్ సూపర్ 4 లో ఇప్పటికే పాకిస్థాన్తో మ్యాచ్ లో ఓడిపోయింది. ఇంకో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తదుపరి రెండు మ్యాచ్ లలో ఆఫ్ఘనిస్థాన్ శ్రీలంకతో జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు మ్యాచ్ లలో కూడా ఇండియా తప్పక గెలవాల్సి ఉంది. ఒకవేళ పాక్ శ్రీలంకను ఓడిస్తే.. శ్రీలంక ఇక ఆసియా కప్ నుంచి నిష్క్రమించాల్సిందే.  శ్రీలంక పాకిస్తాన్ మీద గెలిస్తే ఇక నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది అని చెప్పాలి. అలా అయితే భారతజట్టు ఇక రెండు మ్యాచ్ లలో కూడా భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే భారత నెట్ రన్ రేట్  మైనస్ లో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: