ఇండియా vs పాకిస్తాన్.. రేటింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్?

praveen
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రపంచ క్రికెట్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే  ఏకంగా సూపర్ డూపర్ థ్రిల్లర్ సినిమాను చూసిన ఫీలింగ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ  చూస్తే కలుగుతూ ఉంటుంది.  అందుకే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కన్నార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం అంతర్జాతీయ వేదికలో మాత్రమే ఈ దాయాదుల పోరు చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం ఉంటుంది.


 ఇప్పుడు ఆసియా కప్ పుణ్యమా అని క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా అందింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 లో మ్యాచ్ ఊహించినదానికంటే ఫ్యాన్స్ కు అసలుసిసలైన ఉత్కంఠ మధ్య మస్త్  ఎంజాయ్ చేశారు అని చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తూ చివరి ఓవర్ వరకు ఎంతో నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మొదటి మ్యాచ్లో ఓటమితో నిరాశలో ఉన్న పాకిస్థాన్ అభిమానులకు సూపర్ 4 లో భారత్ పై విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది.


 ఇలాంటి సమయంలోనే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంట పండించింది అని చెప్పాలి. వ్యూయర్ షిప్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆల్టైమ్ రికార్డు నమోదు అయింది అని చెప్పాలి. ఆసియా కప్ లో భాగంగా జరిగిన మొదట దాయాదుల పోరు దెబ్బకు ఐపీఎల్ 2022, టి20 ప్రపంచకప్ లో జరిగిన మ్యాచ్ల  రికార్డు కూడా బ్రేక్ అయింది అని చెప్పాలి. నిన్నటి దాయాదుల పోరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గరిష్టంగా కోటీ 40 లక్షల మంది చూశారు. ఇప్పవరకు వరకు హాట్ స్టార్ లో హైయెస్ట్ వ్యూస్ కోటి 30 లక్షలు మాత్రమే. ఆగస్టు 28 వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ రికార్డ్ నిన్నటి మ్యాచ్ బద్దలు కొట్టింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: