వావ్.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ?
ప్రతి మ్యాచ్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ అదే రీతిలో ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు. అయితే ఆసియా కప్కు ముందు కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని విరాట్ కోహ్లీ ఇటీవలే ఆసియా కప్లో జట్టుతో చేరాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆట తీరు చూస్తే అతను మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు అన్నది మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆటతీరుపై ప్రస్తుతం ఎంతోమంది మళ్లీ ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు ఆసియా కప్లో భాగంగా భారత జట్టు మూడు మ్యాచ్లు ఆడింది మూడు మ్యాచ్ లలో కూడా విరాట్ కోహ్లీ ప్రదర్శన చెప్పుకోదగ్గదే అని చెప్పాలి.
పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా ఇంగ్లీష్ ఇన్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత నిలిచినా కోహ్లీ హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మరోసారి 60 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. అయితే టీమిండియా ఓడిపోయినప్పటికీ కోహ్లీ మాత్రం ఒక అరుదైన ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టి-20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ. అంతకుముందు రోహిత్ శర్మ 31 సార్లు 50+సాధించిన ప్లేయర్గా టాప్ లో ఉండగా ఇటీవలే హాఫ్ సెంచరీతో 32 సార్లు 50+ స్కోర్ చేసిన కోహ్లీ రోహిత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేశాడు.