ధోని ఒక్కడే నాకు మెసేజ్ చేసాడు.. ఆ నిజం చెప్పిన కోహ్లీ?

praveen
మొన్నటి వరకు పేలవమైన ఫామ్ తో ఇబ్బందులు పడ్డారు విరాట్ కోహ్లీ. ఇప్పుడు మళ్ళీ తన మునుపటి ఫామ్లోకి వచ్చాడ అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అవును అనే సమాధానం వినిపిస్తోంది.  ఎందుకంటే ఇటీవలే ఆసియా కప్లో భాగంగా భారత్ ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు విరాట్ కోహ్లీ. మొదట పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేసి జట్టులోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. హంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులు చేసి అజేయంగా హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.
 ఇక ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 44 బంతుల్లోనే 60 పరుగులు చేసి తనకు తిరుగు లేదు అని నిరూపించాడు విరాట్ కోహ్లీ. ఇక తన రెండవ హాఫ్ సెంచరీతో మరోసారి రికార్డుల వేట ప్రారంభించాడు అనే చెప్పాలి. ఎక్కడ తడబాటుకు గురికాకుండా ఎంతో కాన్ఫిడెంట్ తో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూసి అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తనపై విమర్శలు చేసిన వారికి తన బ్యాట్ తోనే సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పాకిస్తాన్ తో మ్యాచ్  అనంతరం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ తనను విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.

 ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. నిజంగా నిజాయితీగా సలహాలు ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటు తన ఫామ్ గురించి సోషల్ మీడియాలో రచ్చ చేసినవారికి చురకలు అంటించాడు. టీవీ తో ముందు కూర్చుని ఏదో వాగినంత మాత్రాన తాను పట్టించుకోను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నేను టెస్ట్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు నాకు కేవలం ఒకే ఒక్క వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. గతంలో నేను ఎంతో మందితో కలిసి ఆడాను. చాలామంది దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది. కానీ వాళ్ళు ఎవరు నన్ను  పలకరించలేదు. టీవీలో చర్చలో మాత్రం సలహాలిస్తుంటారు. నాకు మెసేజ్ చేసిన వ్యక్తి మహేంద్రసింగ్ ధోని. మీకు ఒకరి పట్ల గౌరవం ఉండి వారు బాగుండాలని కోరుకుంటే అలా ప్రవర్తిస్తారు. నిజంగా నేను ఆయన నుండి ఏమీ ఆశించలేదు. ఆయన కూడా అంతే నా నుంచి ఏమీ ఆశించలేదు. ఎవరికైనా మంచి చేయాలని భావిస్తే వారితో వ్యక్తిగతంగా మాట్లాడండి ఉపయోగకరంగా ఉంటుంది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: