"డ్రగ్స్ కేసు తో స్టార్ ప్లేయర్ బ్యాన్"... కట్ చేస్తే టీ 20 వరల్డ్ కప్ ఛాన్స్ ?
అయితే ఇప్పటికే అతని వయసు 33 సంవత్సరాలు ఉండడంతో ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ యాజమాన్యం ఏ ఫార్మాట్ లోనూ స్థానం కల్పించడానికి ముందుకు రాలేదు. కానీ అతనికి ఇంగ్లాండ్ వేదికగా జరిగిన హండ్రెడ్ టోర్నీ బాగా కలిసి వచ్చింది. ఇందులో ట్రెంట్ రాకెట్స్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి తన జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో హేల్స్ అయిదవ స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఈ ప్రదర్శనే ఇప్పుడు అతని జీవితాన్ని మార్చబోతోంది. ఇంగ్లాండ్ ఈ నెలలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. అందులో భాగంగా ఏడూ టీ 20 లు మరియు మూడు టెస్ట్ లు ఆడనుంది... దురదృష్టవశాత్తూ జూనీ బెయిర్ స్టో గోల్ఫ్ ఆడుతూ గాయపడడంతో అతని స్థానంలో హేల్స్ ను తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అంతే కాకుండా వచ్చే నెలలో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ జట్టు లోనూ హేల్స్ కు చోటు దక్కింది. మూడేళ్ళ క్రితం డ్రగ్స్ తీసుకుని బ్యాన్ అయిన హేల్స్ ఇప్పుడు వరల్డ్ కప్ కు సెలెక్ట్ అవ్వడం మాములు విషయం కాదు.