ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్.. చరిత్ర సృష్టించింది?
ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు ఉత్కంఠ ఆ రేంజిలో ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు అయితే దాయదుల పోరు కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు అదో ఎమోషన్ గౌరవం అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కన్నార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అందుకే వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం వ్యూయర్షిప్ పరంగా కూడా రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన క్రేజ్ మాత్రం తగ్గలేదు అన్నదానికి ఇక్కడ ఒక రికార్డు నిదర్శనం అని చెప్పాలి.
ఆసియా కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు ఆగస్టు 28 వ తేదీన మొదటి మ్యాచ్ ఆడాయి. మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరి బంతి వరకు జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆగస్టు 28 వ తేదీన జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రికార్డు సృష్టించింది. ప్రపంచ కప్ టోర్నీ కాకుండా అత్యధికంగా ప్రేక్షకుల వీక్షించిన టి 20 మ్యాచ్ గా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చరిత్రకెక్కింది.. బిఏఆర్సి డేటా ప్రకారం.. స్టార్ స్పోర్ట్స్.. డిడి స్పోర్ట్స్ లో 133 మిలియన్ల మంది ఈ మ్యాచ్ వీక్షించారు. దీన్ని బట్టి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంత హైప్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.