వరల్డ్ కప్ జట్టు ప్రకటన.. అతనికి అన్యాయం జరిగిందంటూన్న ఫ్యాన్స్?
ఎందుకంటే జట్టు అవసరాల మేరకు మాత్రమే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నామని ఎవరి పట్ల వివక్ష చూపించడం లేదని బీసీసీఐ సెలెక్టర్లు చెబుతూ ఉంటారు. కానీ కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం కొంత మంది ఆటగాళ్ల విషయంలో సెలెక్టర్లు కాస్త వివక్ష పూరితంగానే వ్యవహరిస్తూ ఉంటారు అని అభిమానులు భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు సంజు శాంసన్ విషయంలో కూడా సెలెక్టర్లు ఇలాగే వ్యవహరిస్తున్నారు అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం. కొన్ని రోజుల నుంచి కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫాంలో కొనసాగుతున్నాడు సంజు శాంసన్.
ఐపీఎల్లో బాగా రాణించి టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఇండియా తరఫున కూడా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో అతనికి టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కాగా ఇటీవలే బిసిసిఐ విడుదల చేసిన టి20 వరల్డ్ కప్ జట్టులో సంజు శాంసన్ పేరు కనిపించలేదు. దీంతో బీసీసీఐ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంజూ శాంసన్ చాలా టాలెంటెడ్ ప్లేయర్ అని ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్లపై ఎంత సులభంగా భారీ షాట్స్ ఆడగలడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాంటి సంజూ శాంసన్ ను కనీసం స్టాండ్ బై క్లియర్ గా కూడా వరల్డ్కప్కు ఎంపిక చేయలేదని అతను తప్పకుండా వరల్డ్ కప్లో చోటు దక్కాల్సిన ప్లేయర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.