రిజ్వాన్ హాఫ్ సెంచరీ చేశాడు.. కానీ ఏం ఉపయోగం : షోయబ్ అక్తర్
ఇక ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఆటగాళ్లు చేసిన తప్పిదం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా కీలక ఆటగాడైన మహమ్మద్ రిజ్వాన్ ఎంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడమే పాకిస్తాన్ ఓటమికి కారణం అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన జట్టే విజయం సాధిస్తుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ ఓడిపోయినప్పటికీ శ్రీలంక విజయం సాధించింది. పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇక ఇదే విషయంపై స్పందించిన ఆ దేశ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ ప్రదర్శనపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడి అయిన బాబర్ అజాం, మహమ్మద్ రిజ్వాన్ లపై విమర్శలు గుప్పించాడు. మిడిలార్డర్లో వచ్చే ఫకర్ జామన్, మరికొంతమంది బ్యాట్స్మెన్లను లను కూడా తీవ్రంగా విమర్శించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ కాంబినేషన్ అస్సలు పనిచేయడం లేదు. ఇక ఎన్నో విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మహమ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ బ్యాటింగ్ లో వేగం తగ్గిన కారణంగా అది జట్టు విజయానికి ఉపయోగపడలేదు. శ్రీలంక జట్టు మాత్రం అద్భుతంగా రాణించింది. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు.