భారత పర్యటనకు ముందు.. ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ?
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ జట్టులోని సభ్యులు అందరినీ కూడా దాదాపు ఆస్ట్రేలియాతో జరగబోయే టి20 సిరీస్ కు ఎంపిక చేసింది. ఇక ఇటీవలే వరల్డ్ కప్ జట్టు ప్రకటన చేసిన సమయంలోనే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే జట్టు భారత పర్యటనకు రావడానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని తెలుస్తోంది. చెట్టు లో ఉన్న ముగ్గురు స్టార్ క్రికెటర్లు కూడా సిరీస్ కు దూరం కాబోతున్నారట.
గత కొంతకాలం నుంచి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర వహిస్తున్న మిచెల్ మార్స్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ లాంటి స్టార్ ప్లేయర్లు ఇక భారత్ తో జరగబోయే టి20 సిరీస్ ఆడటం లేదు అన్నది ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ ముగ్గురి స్థానంలో నాథన్ ఎలీస్, డేనియల్ సామ్స్, సీన్ అబట్ ను జట్టులోకి తీసుకోబోతున్నారు అనేది తెలుస్తుంది. ఇక స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమైన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేది మరింత ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈనెల 20వ తేదీ నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది అన్న విషయం తెలిసిందే.