బీసీసీఐ చైర్మన్ గా జై షా.. ఇక సౌరవ్ గంగూలీ?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ప్రస్తుతం సౌరవ్ గంగూలీ కొనసాగుతున్నాడు. అయితే బీసీసీఐ సెక్రటరీ హోదాలో  ప్రస్తుతం హోంమంత్రి అమిత్ షా కొడుకు జై షా కొనసాగుతున్నారు.  అయితే మరికొన్ని రోజుల్లో అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి లో అనూహ్యమైన మార్పులు జరుగ బోతున్నాయా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి రాజ్యాంగంలో సవరణలకు ఆమోదం తెలుపుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. తద్వారా   పాలకమండలిలో మరో విడత పదవులు చేపట్టేందుకు అందరికీ గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు అయింది.


 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వరుసగా 12 ఏళ్లపాటు పదవుల్లో కొనసాగే వెసులుబాటు అందరికీ లభించింది అని చెప్పాలి. తద్వారా బిసిసిఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ కార్యదర్శిగా జై షా మరో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగేందుకు లైన్ క్లియర్ అయింది అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలోనే మరో ఆసక్తికర విషయం కూడా తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం బిసిసిఐ సెక్రటరీ హోదాలో ఉన్న జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్నాడు అని.. బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉన్న సౌరవ్ గంగూలీ ఐసిసి అధ్యక్ష రేసులో ఉండబోతున్నాడని ప్రస్తుతం  ప్రచారం జరుగుతుంది అని చెప్పాలి.


జై షాకు బిసిసిఐ అధ్యక్షుడు పదవి ఇచ్చేందుకు పదిహేను రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఉన్న గ్రేట్ బార్క్లే పదవీకాలం ఈ ఏడాది నవంబర్ తో ముగుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ స్థానంలో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి కూర్చోబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైతే క్రికెట్ లో అత్యున్నత పదవి చేపట్టిన అయిదవ భారతీయ క్రికెటర్గా రికార్డులకెక్కాడు సౌరవ్ గంగూలీ. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: