ఫాన్స్ ని కంగారు పెట్టిన గుజరాత్ టైటాన్స్.. ఎందుకో తెలుసా?
ఇటీవల కాలంలో బాగా గుర్తింపు సంపాదించుకున్న యువ ఆటగాడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక శుభమన్ గిల్ కు సంబంధించి పోస్ట్ వైరల్ కావడంతో.. అతడు గుజరాత్ టైటన్స్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. గుజరాత్ ఫ్రాంచైజీ అతడి పట్ల వివక్ష చూపించింది అంటూ ఎంతో మంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ వార్త సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే సెన్సేషన్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇదే విషయంపై ఇటీవలే గుజరాత్ టైటన్స్ యాజమాన్యం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
ఆ ట్విస్ట్ కు అర్థం మీరు అనుకున్నది కాదు.. గిల్ మాతోనే ఉంటాడు అంటూ పేర్కొంది. దీంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి తికమక పోస్టులు పెట్టడం ఆపండి అంటూ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అయితే మాతో నీ ప్రయాణం మరువలేనిది.. నీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాము అంటూ శుభమన్ గిల్ ను ఉద్దేశిస్తూ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఒక పోస్టు పెట్టింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారి పోవడం తో గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ మధ్య బంధం తెగిపోయింది అని అందరూ భావించారు. చివరికి ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది.