మొదటి రాత్రి టెస్ట్ మ్యాచ్ లా జరిగింది.. అశ్విన్ భార్య షాకింగ్ కామెంట్స్?
ఇక ఇప్పుడు టీమిండియాలో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ భార్య సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 255 అంతర్జాతీయ మ్యాచుల్లో 659 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు బ్యాటింగ్ లో ఐదు సెంచరీలు కూడా చేసి 3599 పరుగులు సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు గా గుర్తింపు సంపాదించాడు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అతనికి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ కూడా సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. చమత్కారానికి వెటకారం జోడిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఎవరైనా సరే వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడం తప్పే అన్న విషయం తెలిసిందే. అలాంటిది అశ్విన్ భార్య మొదటి రాత్రి విషయాలను అభిమానులతో పంచుకుంది. మొదటి రాత్రి గురించి అభిమానులతో పంచుకుంటూ ఫస్ట్ నైట్ ని ఒక టెస్ట్ మ్యాచ్ గా అభివర్ణించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం అందరూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.