అతనే మాకు పెద్ద సవాలు : ఆసీస్ వైస్ కెప్టెన్

praveen
మొన్నటి వరకూ సరైన ఫామ్ లో లేడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే అతని జట్టు నుంచి పీకి పారేయండి అంటూ ఎంతో ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం చూసాము. అయితే విరాట్ కోహ్లీ ఇప్పుడు మళ్లీ మునుపటి ఫామ్ అందుకున్నట్టుగానే కనిపించాడు. ఇటీవలే  ఆసియా కప్లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేశాడు అనే విషయం తెలిసిందే. ఇక టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ చేసిన పరుగులు కీలక ఇన్నింగ్స్ గా మారి పోవడం గమనార్హం. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.


 ఈ క్రమంలోనే అభిమానులు అందరూ ఎంతో ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే సెంచరీతో తాను ఫాం లోకి వచ్చాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పిన విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్లు అందరికీ కూడా ఊహించని సవాల్ విసిరాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చిన నేపథ్యంలో అతని దృష్టిలో పెట్టుకుని తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవడం చేస్తూ ఉన్నాయి ప్రత్యర్థి జట్లు. ప్రపంచ కప్లో తన బ్యాటింగ్తో ప్రభంజనం సృష్టిస్తాడని  ఎంతోమంది అభిమానులు కూడా గట్టిగా నమ్ముతున్నారు.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం పై ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ చూశానని.. అతను ఒక క్లాస్ ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు ప్యాట్ కమ్మిన్స్. విరాట్ కోహ్లీ ఎప్పుడైనా సరే ఫాంలోకి వస్తాడు అన్న విషయం తెలుసు. అయితే ఇక టీమిండియాతో జరగబోయే మ్యాచులలో అతను మాకు ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. భారత్లో ఆడేటప్పుడు తమ బౌలర్లు కాస్తా భిన్నంగా బంతులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్లో ఉన్న బౌండరీలు చిన్నవి. అంతే కాదు పిచ్ కూడా కాస్త నెమ్మదిగా ఉంటుంది అంటూ పాట్ కమ్మిన్స్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: