సర్పరాజ్ ఖాన్ ఇన్నింగ్స్ కి.. సూర్య కుమార్ ఫిదా.. ఏమన్నాడంటే?
ఇరానీ కప్ లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియాకు సర్పరాజ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ టోర్నీలో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో సర్పరాజ్ ఖాన్ మరోసారి అదరగొట్టాడు. ఏకంగా అద్భుతమైన సెంచరీ తో అజేయంగా నిలిచాడు అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో 178 బంతులను ఎదుర్కొన్న సర్పరాజ్ ఖాన్ 20 ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో 138 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోని అతని అద్భుతమైన సెంచరీపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ సైతం సర్పరాజ్ ఖాన్ ను ప్రశంసించాడు.
ఈ క్రమంలోనే ట్విటర్ వేదికగా అతనిపై ప్రశంసలు కురిపించాడు. తన ట్విట్టర్ ఖాతాలో సర్పరాజ్ ఖాన్ సెంచరీ పూర్తి చేసిన ఫోటోని షేర్ చేస్తూ.. నీ ప్రదర్శన పట్ల ఎంతో గర్వంగా ఉన్నాను అంటూ ఒక క్యాప్షన్ జోడించాడు సూర్య కుమార్ యాదవ్. ఇక సూర్య కుమార్ చేసిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా రెస్ట్ ఆఫ్ ఇండియా 374 పరుగులకు ఆల్ అవుట్ కాగా. ఇక సర్పరాజ్ ఖాన్ సెంచరీ చేస్తే కెప్టెన్ హనుమ విహారి 82 పరుగులతో రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో రెస్ట్ ఆఫ్ ఇండియా కు 276 పరుగులు ఆదిక్యం లభించింది.