స్టార్ క్రికెటర్ కూతురు మృతి.. ఎమోషనల్ వీడియో?

praveen
గత కొంతకాలం నుంచి సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఎంత మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు అటు భారత పర్యటనలో ఉండగా ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. సహచర ఆటగాల్లతో ఎంతో సరదాగా కనిపిస్తూ తన ఆటతీరుతో ఎంతగానో అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాడు. ఇక ఇలాంటి ఆనంద సమయాల మధ్య డేవిడ్ మిల్లర్ ఇంట్లో ఊహించని విషాదకర ఘటన చోటుచేసుకుంది.

 ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ ఎంతో అల్లారూ ముద్దుగా పెంచిన డేవిడ్ మిల్లర్ కూతురు ఇటీవల ప్రాణాలు వదిలింది. దీంతో డేవిడ్ మిల్లర్ గుండె పగిలేనంత పని అయింది. ఈ విషయం తెలిసి అటు అభిమానులు అందరూ కూడా దిగ్బ్రాంతిలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఈ విషయాన్ని డేవిడ్ మిల్లర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఇక డేవిడ్ మిల్లర్ పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కూతురు క్యాన్సర్ తో బాధపడుతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి క్యాన్సర్ చికిత్స చేసినప్పటికీ ఆమెకు నయం కాలేదు. చివరికి క్యాన్సర్ తో పోరాడుతూ ఆ చిన్నారి కన్ను మూసింది. దీంతో స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇక తన చిన్నారి పాపతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు తన చిన్నారి పాపతో ఆడుకుంటున్న వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది చూసి అటు అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: