కోహ్లీ తోపు.. ఎవరు అధిగమించలేరు : ఇయాన్ చాపెల్

praveen
ప్రపంచ క్రికెట్లో బెస్ట్ క్రికెటర్ ఎవరు అన్న విషయంపై గత కొంతకాలం నుంచి జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, బాబర్ అజం, జోరూట్, స్టీవ్ స్మిత్, మార్నెస్ లబుషణ్ ఇలా ఎంతోమంది క్రికెటర్ల పేర్లు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే వీరందరితో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ ఎంతో అత్యుత్తమమైన గణాంకాలు కలిగి ఉన్నప్పటికీ మొన్నటి వరకు కొన్నాళ్లపాటు ఫామ్ కోల్పోయాడు. దాదాపు మూడేళ్ల నుంచి పేలవమైన ఫాంతో ఇబ్బంది పడ్డ విరాట్ కోహ్లీ.. ఇటీవల ఆసియా కప్ లో సెంచరీ చేసి తిరిగి తన ఫామ్ సాధించాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు ఎవరు అనే విషయంపై భారత మాజీ కోచ్ ఇయాన్ చాపిల్ ఇటీవల సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో బాబర్ అజాం, జోరూట్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషణ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని. కానీ వీరెవరు కూడా విరాట్ కోహ్లీని అధిగమించలేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  నాటి క్రికెటర్లలో ఎవరు మేటి అంటే సర్ బ్రాడ్మన్ అని చెప్పొచ్చు.  కానీ నేటి ఆధునిక క్రికెటర్లలో ఎవరు బెస్ట్ అంటే పైన ఉన్న లిస్టులో ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టం.



 కానీ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించడం మాత్రం మిగతా వాళ్ళకి ఎంతో కష్టం అంటూ ఇయాన్ చాపేల్ అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ అత్యంత పోటీ తత్వ స్వభావం కలిగిన ఆటగాడు  . బ్యాటింగ్ విషయంలో అతని ఆలోచన విధానం అందరికంటే భిన్నంగా ఉంటుంది. 2014లో ఆడిలైట్ వేదికగా రెండు టెస్టులలో కోహ్లీ సాధించిన రెండు సెంచరీలు నా ఫేవరెట్ గా నిలిచిపోయాయి అంటూ ఇయాన్ చాపల్ తెలిపాడు. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మాత్రం విరాట్ కోహ్లీ ఆట కాస్త పడిపోయిందని మళ్లీ తన మ్యాజిక్ చూపించాలని  ఆశపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: