వావ్.. టీమిండియా సొంత రికార్డు బ్రేక్ చేసి.. ప్రపంచ రికార్డు సమం చేసింది?

praveen
ఇప్పటికే భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా ను చిత్తుగా ఓడించి టి20 సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియ. ఈ క్రమంలోనే కీలక ఆటగాళ్లు వరల్డ్ కప్ నేపథ్యంలో ఆస్ట్రేలియా పయనం అవ్వగా.. యువ ఆటగాళ్లు  జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా ఎలా రాణిస్తుందో అనే అనుమానం అందరిలో ఉంది.  ఇక మొదటి మ్యాచ్ లో ఓడిపోవడంతో అందరూ నిరాశలో మునిగిపోయారు. అయితే కీలకమైన ప్లేయర్లు లేకపోవడంతో టీమిండియా సిరీస్ చేజార్చుకోవడం ఖాయం అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి.


 అయితే అప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో  పట్టు బిగించే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా ఆ తర్వాత రెండు మ్యాచ్లలో మాత్రం విజయం సాధించింది. ఇటీవలే అరుణ్ జెట్లీ స్టేడియంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుని సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. తద్వారా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.


 అదే సమయంలో ఇటీవలే మూడో వన్డే మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు.. అటు ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది అని చెప్పాలి. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా సరసన భారత్ చోటు సంపాదించుకుంది.  2003లో ఆస్ట్రేలియా ఒక క్యాలెండరు ఇయర్లో  38 విజయాలు సాధించింది. అయితే మొన్నటి వరకు భారత్ ఒక క్యాలెండర్ ఇయర్ లో 37 విజయాలు సాధించిన జట్టుగా కొనసాగింది. మూడో వన్డేలో విజయంతో సొంత రికార్డును బ్రేక్ చేయడమే కాదు.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక  విజయాలు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: