మా నాన్న నేను టెన్త్ కూడా పాస్ అవ్వను అనుకున్నాడు : ధోని

praveen
మహేంద్ర సింగ్ ధోని.. ఇది కేవలం ఒక క్రికెటర్ పేరు మాత్రమే కాదు ఇది ఒక పెద్ద బ్రాండ్ అన్నట్లుగా మారిపోయింది అంతర్జాతీయ క్రికెట్లో. ఇక ఈ పేరుకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక భారత క్రికెట్లో అయితే మహేంద్రసింగ్ ధోని ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులకు దేవుడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోని క్రేజ్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక ఇప్పటివరకు భారత క్రికెట్ లో రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని కొనసాగుతున్నాడు. ధోని తర్వాత కోహ్లీ కెప్టెన్సీ చేపట్టినప్పటికీ అటు టీమిండియా కు వరల్డ్ కప్ అందించలేకపోయాడు. అయితే మైదానంలో ఎంతో కూల్ గా ఉంటూ ఒత్తిడిలో కూడా చిరునవ్వులు చిందిస్తూ తనదైన వ్యూహాలతో మ్యాచ్ను తిప్పేస్తూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని.  తనలో ఉండే ఈ ప్రశాంతతే అతన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ధోని ఎప్పుడూ పెద్దగా యాక్టివ్ గా ఉండడు. కానీ ఎప్పుడు ధోని కి సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ గా మారిపోతూనే ఉంటాయి.


 ఇకపోతే ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన చదువు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. నేను పదవ తరగతి పరీక్షల్లో కూడా పాస్ అవ్వను అని మా నాన్న అనుకున్నాడు. కానీ నేను పది పరీక్షల్లో పాస్ అయ్యాను.. ఆ తర్వాత పరీక్షల్లోనూ అలాగే పాస్ అయ్యాను. అయితే అలా పాస్ అయినందుకు తన తండ్రి ఎంతో సంతోషించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకు పదవ తరగతిలో 66% మార్కులు వస్తే ఇంటర్లో 55% వచ్చాయి అంటూ ఇటీవల  ధోని చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: