బుమ్రా లేని లోటును షమీ తీరుస్తాడా ? నమ్మకాన్ని నిలబెడతాడా?
అయితే ఇండియా టీమ్ కొద్ది రోజుల క్రితమే ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్ళినా, పూర్తి టీమ్ తో వెళ్ళలేదు.
దక్షిణాఫ్రికా తో టీ 20 సిరీస్ సమయంలో బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. దానితో మొత్తం 15 మందితో వెళ్లాల్సి ఉండగా... స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడడం తో కేవలం 14 మంది మాత్రమే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు. అయితే ఈ 15 వ ప్లేయర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అయితే తాజాగా బీసీసీఐ బుమ్ర స్థానంలో మరొక్క ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ని సెలెక్ట్ చేసింది. అయితే మహమ్మద్ షమీ కి ఇది ఒక పెద్ద సవాలు లాంటిది అని చెప్పాలి. మాములుగా డైరెక్ట్ గా కనుక వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయి ఉంటే.. పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ కీలకం అయిన బుమ్ర స్థానంలో ఎందరిని పరిశీలించి షమీ ని ఫైనల్ చేయడంతో ఇప్పుడు అదనపు భారం అతనిపై పడిందని చెప్పాలి.
ఈ స్థానం కోసం చాలా మంది మహమ్మద్ సిరాజ్ ఎంపికవుతాడని ఊహించారు. కానీ సెలెక్టర్లు మాత్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మహమ్మద్ షమిని జట్టులోకి తీసుకున్నారు. అయితే మహమ్మద్ షమీ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుని మరియు అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకుని ఇండియాకు టీ20 కప్ ను అందిస్తాడా లేదా చూడాలి.