వావ్.. బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్లో అదరగొట్టిన తిలక్ వర్మ?

praveen
ఒకే ఒక ఐపిఎల్ సీజన్ తో ఊహించిన రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ జట్టులో చోటు సంపాదించుకున్న ఈ యువ ఆటగాడు తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలమవుతున్న సమయంలో తిలక్ వర్మ మాత్రం ఎంతో నిలకడగా రాణిస్తూ భారీగా పరుగులు చేస్తూ కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. దీంతో తక్కువ సమయంలోనే అతని టీమిండియా జట్టులోకి రావడం ఖాయం అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి.


 ఇకపోతే ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా తిలక్ వర్మ మరోసారి అదరగొట్టాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ జట్టు భోని చేసింది. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే   బ్యాటింగ్ తో బాగా రాణించాడు తిలక్ వర్మ.  హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. అయితే తిలక్ వర్మ బ్యాటింగ్లో రాణిస్తాడు అనే విషయం అందరికి తెలుసు కానీ ఇటీవల పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ లో కూడా పొదుపుగా పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.



 తొలిత హైదరాబాద్ ఎనిమిది వికెట్లకు 147 పరుగులు చేయగా ఇక లక్ష చేదనకు దిగిన పుదుచ్చేరి జట్టు చివరి వరకు పోరాడింది. ఈ క్రమంలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేయగలిగింది.. కాగా హైదరాబాద్ ఇన్నింగ్స్ లో తిలక్ వర్మ 41 బంతుల్లోనే 57 పరుగులు చేసి హార్ధ సెంచరీ చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ ఉండడం గమనార్హం. అంతేకాకుండా 3 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు తిలక్ వర్మ. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తిలక్ వర్మకు ఇది వరుసగా రెండవ అర్ద సెంచరీ కావడం గమనార్హం.  అంతకుముందు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లోను తిలక్ వర్మ  50 పరుగులు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: