పదవి పోవడంపై.. ఎట్టకేలకు స్పందించిన గంగూలీ.. ఏమన్నాడంటే?
అయినప్పటికీ దాదాకి భంగపాటు తప్పలేదు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే సౌరబ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం వెనుక అటు బిజెపి రాజకీయ కుట్ర ఉంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది అని చెప్పాలి. కాగా సౌరబ్ గంగూలీ బీజేపీలో చేరకపోవడం కారణంగానే ఇక ఇలా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అంటూ ఎంతో మంది చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతూ ఉండగా ఇటీవల సౌరబ్ గంగూలీ ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆటగాడిగా అడ్మినిస్ట్రేటర్ గా జీవితకాలం కొనసాగడం కుదరదని ఏదో ఒక రోజు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే అంటూ వైరాగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు సౌరబ్ గంగూలీ. ఇక బోర్డు అధ్యక్షుడిగా నాణెములో రెండు కోణాలు కూడా చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భవిష్యత్తులో ఇంతకంటే అత్యున్నత పైన పదవిని చేపట్టేందుకు ప్రయత్నిస్తానని ఇక ఐసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఆశ ఉంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు సౌరబ్ గంగూలీ. ఇప్పటికే టీమిండియా కెప్టెన్గా స పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీసీసీఐ అధ్యక్షుడిగా పదవులు చేపట్టాను. ఇక రానున్న రోజుల్లో మరింత గొప్ప పదవిని చేపడుతాను అంటూ తెలిపారు.