ఐసీసీ పదవిలో సౌరవ్ గంగూలీ.. ఇన్ డైరెక్ట్ గా ఇదే చెప్పారా?

praveen
గత కొంత కాలం నుంచి ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరబ్ గంగూలీ పదవి నుంచి వైదొలగడం గురించిన చర్చే ఎక్కువగా భారత క్రికెట్లో జరుగుతుంది అని చెప్పాలి. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరబ్ గంగూలీ ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని చేపట్ట బోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి వార్తల పై స్పందించిన సౌరబ్ గంగూలీ సున్నితం గానే వార్తలను ఖండించారు అన్న విషయం తెలిసిందే. అది అంత సులభం కాదు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నిజం గానే సౌరబ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు అని అందరూ ఫిక్సయ్యారు.


 ఇలాంటి సమయం లోనే మరో ప్రచారం తెర మీదకి వచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి కొనసాగాలని భావించిన సౌరబ్ గంగూలీకి నిరాశ ఎదురయింది అంటూ ప్రచారం మొదలైంది. బిసిసిఐ పెద్దలు సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలీ అధ్యక్షుడుగా ఉండేందుకు అంగీకరించలేదని.. ఈ క్రమంలోనె అతను పదవి నుంచి తప్పుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై స్పందించాడు  గంగూలీ.

 ఏ పదవిలో అయినా సరే జీవిత కాలం కొనసాగడం కుదరదు అని.. ఏదో ఒక రోజు బాధ్యతల నుండి తప్పుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. ఆటగాడిగా కెప్టెన్గా అధ్యక్షుడిగా ఇప్పటికే అన్ని పదవులను చేపట్టాను. ఇక రానున్న రోజుల్లో మరింత అత్యున్నతమైన పదవిని చేపడుతాను అంటూ తెలిపాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి తర్వాత అత్యున్నతమైన పదవి అంటే అటు ఐసిసి చైర్మన్ పదవి కావడం గమనార్హం. దీంతో అత్యున్నత పదవి అంటూ సౌరబ్ గంగూలీ  వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు అన్న ప్రచారం మొదలైంది. మరి ఏం జరగబోతుంది అన్నది రానున్న రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: