నేను దీప్తిశర్మని కాదు.. అలా చేయడానికి?
రూల్స్ ప్రకారం మన్కడింగ్ చట్టబద్ధం కావడంతో అంపైర్ కూడా ఇక చార్లీ డీన్ ను ఔట్ గా ప్రకటించారు అని చెప్పాలి. ఈ చర్య పై క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా రెండుగా చీలిపోయారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం సమయం దొరికినప్పుడల్లా దీప్తి శర్మ మాన్కడింగ్ విధానాన్ని తప్పుపడుతూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇంగ్లాండ్ కు మద్దతుగా నిలుస్తూ ఆస్ట్రేలియా ఫేసర్ మిచెల్ స్టార్క్ దీప్తి మన్కడింగ్ చేయడానికి పరోక్షంగా తప్పుపట్టాడు. నేను మన్కడింగ్ చేయడానికి దీప్తి శర్మను కాదు అంటూ కామెంట్ చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ జరిగిందన్న విషయం తెలిసిందే.
ఇక మూడో టి20 మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో 5 ఓవర్లో మిచెల్ స్టార్క్ బంతి వేయడానికి ముందే నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న బట్లర్ క్రీజు దాటాడు. కానీ మిచెల్ స్టార్క్ మాత్రం రన్ అవుట్ చేయకుండా బట్లర్ ను హెచ్చరికతో వదిలిపెట్టాడు. ఆ తర్వాత రన్అప్ కు వెళ్తూ నేనేమీ దీప్తిని కాదు మన్కడింగ్ చేయడానికి కానీ ఇది రిపీట్ చేయకు అంటూ మిచెల్ స్టార్క్ మాట్లాడింది అక్కడ ఉన్న స్టంప్స్ లో రికార్డ్ అయింది. ఇక అతను అలా అనడంతో అంపైర్ తో పాటు బట్లర్ కూడా నవ్వుల్లో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది.