సూర్య కుమార్ యాదవ్ రికార్డు.. బ్రేక్ చేసిన పాకిస్తాన్ ప్లేయర్?

praveen
పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ గత కొంతకాలం నుంచి మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు అనే విషయం తెలిసిందే. ఓపెనర్గా బరిలోకి దిగుతూ భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల పాకిస్తాన్ ట్రై సిరీస్ లో టి20 మ్యాచ్ లు ఆడుతుంది. కాగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 34 పరుగులు సాధించాడు మహమ్మద్ రిజ్వాన్. ఈ క్రమంలోనే పాకిస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్లో సాధించిన 34 పరుగుల ద్వారా ఒక అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

ఈ  క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో టి20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మహమ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 18 ట20 మ్యాచ్ లు ఆడిన మహమ్మద్ రిజ్వాన్  821 పరుగులు సాధించాడు.  కాగా అంతర్జాతీయ టి20లో ఇక ఇప్పటివరకు ఈ ఏడాది ఇవే అత్యధిక పరుగులు కావడం గమనార్హం. ఇక అంతకుముందు ఈ రికార్డు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ పేరిట ఉండేది అని చెప్పాలి. అటు సూర్య కుమార్ యాదవ్ కూడా ప్రస్తుతం కెరియర్ లో ఎంతో అత్యున్నతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే 2022 ఏడాదిలో సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు 23 మ్యాచ్ లు ఆడి ఎనిమిది వందల ఒక పరుగుల సాధించాడు. ఈ ఏడాది టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ రికార్డ్ సృష్టించాడు.. ఇక ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ రికార్డును బ్రేక్ చేసిన పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 821 పరుగులతో అగ్రస్థానంలోకి వచ్చేసాడు.  అయితే ఇక ఇద్దరూ క్రికెటర్లు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన టి20 ఫార్మాట్ ర్యాంకింగ్స్లోతొలి రెండు స్థానాలలో కొనసాగుతూ ఉన్నారూ అని చెప్పాలి. ఇకపోతే వరల్డ్ కప్ లో భాగంగా ఈనెల 23వ తేదీన భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: