భారత్ తో మ్యాచ్ కి ముందు.. పాకిస్తాన్ కి గుడ్ న్యూస్?

praveen
టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుంది అనుకుంటున్నా సమయంలో ఇక ప్రపంచకప్ లో పాల్గొనబోయే కొన్ని జట్లకు ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ క్రమంలోనే జట్టులోకి ఉన్న కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ దూరమయ్యారు. ఇక ఇలాంటి పరిస్థితి అటు భారత దాయాది దేశమైన పాకిస్తాన్ కు కూడా వచ్చింది అని చెప్పాలి. టి20 ప్రపంచ కప్ కి ముందు అటు పాకిస్తాన్ ఇంగ్లాండ్ తో ఆడిన టి20 సిరీస్ లో భాగంగా కీలక బ్యాట్స్మెన్ అయినా ఫక్కర్ జమాన్ గాయం మారిన పట్టి జట్టుకు దూరమయ్యాడు.


 దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఈ నెల 23వ తేదీన పాకిస్తాన్ జట్టు భారత్తో తొలి మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు అటు పాకిస్తాన్ జట్టుకు ఊహించని రీతిలో శుభవార్త అందింది అన్నది మాత్రం తెలుస్తుంది. మొన్నటి వరకు గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బ్యాట్స్మెన్ ఫకర్ జమన్ పూర్తిగా కోలుకున్నాడు. ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ కి ముందు మోకాలి గాయంతో బాధపడిన  ఫకర్ జమాన్ ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. అయినప్పటికీ ఇతన్ని టీ20 ప్రపంచ కప్కు రిజర్వ్ ఆటగాడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.


 ఇక ఇప్పుడు ఫకర్ జమాన్ పూర్తిగా మోకాలి గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన నేపథ్యంలో ఇక 15 మంది ఆటగాళ్లతో కూడిన పాకిస్తాన్ టి20 ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకుంటాడు అన్నది మాత్రం తెలుస్తుంది. అయితే ఫక్కర్ జమాన్ కోలుకున్నప్పటికీ ఇక మరో ఆటగాడు ఉస్మాన్ ఖాదీర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదు అన్నది తెలుస్తుంది. దీంతో అతన్ని రిజర్వ్ జాబితాలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉంచింది అన్నది తెలుస్తుంది. సెప్టెంబర్ 25న ఇంగ్లాండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో ఉస్మాన్ ఖాదిర్ కు బొటన వేలుకు గాయం కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: