వైరల్ : విరాట్ కోహ్లీ స్ఫూర్తితో.. గల్లీ క్రికెట్లో దంచి కొడుతున్న బాలిక?

praveen
భారత్లో క్రికెటర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను ఒక సాదాసీదా ఆటగాళ్లుగా కాకుండా ఏకంగా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు. అటు భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ ఎందుకో విదేశీ ఆట అయిన క్రికెట్ కు మాత్రం భారత్లో ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం జాతీయ జట్టు తరఫున ఆడుతున్న ఎంతో మంది క్రికెటర్లను చూసి స్ఫూర్తి పొంది స్కూల్ వయసు నుంచి ఎంతోమంది క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్నారులు క్రికెట్ నే తమ ఫ్యాషన్ గా మార్చుకుంటూ ఇక జాతీయ జట్టుకు ఆడడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు.


 ఇక ఇలా ఎవరైనా  క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొంది బాగా రాణిస్తున్నారు అంటే చారు వారికి సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోతుంది. కాగా ఒకవైపు ఆట విషయంలో మరోవైపు కాన్ఫిడెన్స్ విషయంలో ఇంకోవైపు ఫిట్నెస్ విషయంలో కూడా ఎంతోమందిని ప్రభావితం చేసి స్ఫూర్తిగా నిలిచే విరాట్ కోహ్లీని ఇటీవల ఒక బాలిక స్ఫూర్తిగా తీసుకుంది. విరాట్ కోహ్లీ మైదానంలో ఎలా అయితే ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ భారీ షాట్లు ఆడుతూ ఉంటాడో ఇక్కడ ఒక బాలిక గల్లి క్రికెట్ లో కూడా అలాగే బ్యాట్తో విరుచుకుపడుతూ భారీ షాట్లు ఆడింది.


 ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ వీడియోలో భాగంగా సదరు అమ్మాయి మాట్లాడుతూ తను విరాట్ కోహ్లీ వీరాభిమానిని అంటూ చెప్పుకుంటుంది. తాను కోహ్లీలా ఉండాలని కోరుకుంటున్న అంటూ చెబుతుంది. ఆరో తరగతి చదువుతున్న మక్షుమ బ్యాటింగ్ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. లడక్ లోని విద్యాశాఖ ట్విట్టర్ లో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఇంట్లో మా అమ్మానాన్న స్కూల్లో మా టీచర్లు క్రికెట్ ఆడేందుకు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నా అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీలా ఆడాలని నా శాయశక్తుల ప్రయత్నిస్తున్నాను అంటూ ఆ బాలిక వీడియోలో చెప్పింది   అంతేకాకుండా హెలికాప్టర్ షాట్ నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్న అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: