ఐసీసీ కొత్త రూల్.. కరోనా వచ్చినా మ్యాచ్ ఆడొచ్చు?
ఈ క్రమంలోనే ఆటగాళ్లను బయోబబుల్ అనే పద్ధతిలో హోటల్లో ఉంచుతూ బయట ప్రపంచానికి దూరంగా ఇక మ్యాచ్లు ఆడిస్తూ వచ్చాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే మ్యాచ్ లు కొనసాగించారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇక పరిస్థితులు మళ్లీ చక్కబడ్డాయి.. ఇక అందరూ ఆటగాళ్లను బయో బబుల్లో హోటల్ కి పరిమితం కాకుండా ఇక బయట ప్రపంచంతో సంబంధం కొనసాగిస్తూనే మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా క్రికెట్ స్టేడియం కి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను కూడా అనుమతిస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఈనెల 16వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభమైంది అని చెప్పాలి. ఇకపోతే వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల ఐసీసీ షాకింగ్ నిబంధన అమలులోకి తీసుకువచ్చింది. ఒకవేళ మ్యాచ్ ఆడాల్సిన జట్టులోనే ఆటగాడికి కరోనా వైరస్ వచ్చినప్పటికీ మ్యాచ్లో ఆడటానికి అనుమతి ఇచ్చింది ఐసీసీ. ఇక టోర్నీ సమయంలో ఆటగాళ్లకు కోవిడ్ టెస్ట్ తప్పనిసరి కాదు అంటూ స్పష్టం చేసింది.. ఒకవేళ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిన ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ పేర్కొంది. అయితే ఆటగాడు ఆరోగ్య పరిస్థితిని బట్టి మ్యాచ్ ఆడాలో లేదో నిర్ణయించనున్నారు.