భారత్ - పాక్ మ్యాచ్ ఉంటుందా.. వెదర్ రిపోర్ట్ తో ఫ్యాన్స్ నిరాశ?

praveen
భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ అంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులలో ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తమ దేశం తరఫున ఆడుతున్న జాతీయ జట్టు మ్యాచ్ ఆడిన కూడా అంత ఆసక్తిగా వీక్షిస్తారో లేదో తెలియదు కానీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఏదో తెలియని స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అందరూ. ఈ క్రమంలోనే దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్లు అంతర్జాతీయ క్రికెట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూనే ఉన్నాయి.


 ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి క్రికెట్ సంబంధాలు లేకపోవడం.. కేవలం అంతర్జాతీయ వేదికలపై ఈ రెండు జట్లు తలబడుతూ ఉండడంతో ఈ దాయాదుల పోరు మరింత రసవతరంగా మారిపోయింది అని చెప్పాలి. ఎప్పుడో ఒకసారి మాత్రమే వచ్చే ఈ మ్యాచ్ ని వదిలిపెట్టడానికి క్రికెట్ ప్రేక్షకులు అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఇకపోతే ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈనెల 23వ తేదీన పాకిస్తాన్ భారత్ మధ్య మొదటి మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు కూడా హాట్ కేకుల నిమిషాల్లో అమ్ముడుపోయాయి.


 కొంతమంది స్టేడియం  లో చూసేందుకు ఇంకొంతమంది టీవీల ముందు చూసేందుకు సిద్ధమైపోయారు. ఇలాంటి సమయంలో అసలు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అనే వాదన తెరమీదకి వచ్చింది. ఇది కాస్త ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే రోజు వరునుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఈ విషయం తెలిసి ఆ ఒక్క రోజు వరునుడు కరుణ చూపాలి అంటూ అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: