ఇలా అయితే నువ్వు కెప్టెన్ గా పనికిరావు.. పాక్ క్రికెటర్ పై ట్రోల్స్?

praveen
సాధారణంగా ఒక క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి జట్టు యొక్క అన్ని బాధ్యతలను కూడా భుజాన వేసుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గెలుపు ఓటములకు కూడా ప్రేక్షకులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రత్యర్థి వ్యూహాలను కట్టడి చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త వ్యూహాలను తెరమీదకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఆటగాడిలో ఒత్తిడి ఉండడం సహజం. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం కెప్టెన్సీ విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ అనుచితంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇటీవలే ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో కూడా ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఈ వార్మప్ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ బాబర్ అజం దూరంగా ఉండటంతో షాదాబ్ ఖాన్ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఎప్పుడు కూల్ గా ఉంటూ అటు జట్టు సభ్యులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఉండాలి కెప్టెన్. కానీ షాదాబ్ ఖాన్ మాత్రం కెప్టెన్ గా ఉండి సహనం కోల్పోయి తోటి ఆటగాళ్లపై ఆగ్రహం ప్రదర్శించాడు. చివరికి అతను ప్రవర్తించిన తీరు పై ప్రేక్షకులందరికీ అసహనం వ్యక్తం చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఒక్క రన్ అవుట్ కే సహనం కోల్పోతే ఎలా.. ఇలా అయితే కెప్టెన్ గా నువ్వు ఎప్పుడూ సక్సెస్ కాలేవు అంటూ ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. అప్పటికే లియాన్ లివింగ్ స్టోన్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. షాదబ్ ఖాన్ వేసిన బంతిని లివింగ్ స్టోన్  ఆఫ్ సైడ్ దిశగా ఆడాడు. అయితే లివింగ్ స్టోన్ సింగల్ కోసం నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న హ్యారీబూక్స్ కు కాల్ ఇచ్చినప్పటికీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఆ తర్వాత పరుగు కోసం ప్రయత్నించారు. అప్పటికే బంతి అందుకున్న హరీష్ రౌఫ్ త్రో వేయడంతో విఫలమయ్యాడు. బంతి వికెట్లకు తగిలి ఉంటే లివింగ్ స్టోన్ అవుట్ అయ్యేవాడు కానీ అలా జరగకపోవడంతో కోపంతో ఊగిపోయిన షాదబ్ ఖాన్ హరీష్ రౌఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pak

సంబంధిత వార్తలు: