ఆ ఒక్క జట్టును ఓడిస్తే.. ఇండియా వరల్డ్ కప్ గెలిచినట్టే : రైనా

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే ఆసిస్ గడ్డపై అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే   ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 23వ తేదీన పాకిస్తాన్తో ఆడబోతుంది టీమిండియా. ఇక ఈ దాయాదుల సమయాన్ని చూసేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గత ఏడాది టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ చేతిలో ఘోర ఓటమి  చవిచూసింది టీమిండియా. ఇప్పుడు కొత్త కెప్టెన్ రోహిత్ సారథ్యంలో బలిలోకి దిగిన టీమిండియా ప్రతీకారం తప్పక తీర్చుకుంటుందని భారత క్రికెట్ ప్రేక్షకులు భావిస్తున్నారు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్లలో టీమిండియా మునిగి తేలుతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఆస్ట్రేలియా తో వార్మప్ మ్యాచ్ విజయంతో ముగించిన టీమ్ ఇండియా.. నేడు న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈనెల 23వ తేదీన జరగబోయే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరగబోయే తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును భారత జట్టు ఓడించగలిగితే ఇక టి20 వరల్డ్ కప్ ను టీమిండియా ఎంతో సునాయాసంగా గెలిచి తీరుతుంది అటు సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

 ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు ఆటగాళ్లలో ఎంతగానో ఒత్తిడి ఉంటుంది. ఇక రోహిత్ సేన ఇలా ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్లో బాగా రాణించి విజయం సాధించింది అంటే ఇక మిగతా జట్లతో జరిగే మ్యాచ్ లలో అలవోకక విజయం సాధిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఇక బుమ్రా లాంటి కీలక బౌలర్ జట్టుకు దూరం అవడం నిజంగా టీమిండియా కు ఎదురుదెబ్బే అంటూ వ్యాఖ్యానించాడు. అయితే బుమ్రా స్థానంలో మహమ్మద్ షమిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం అంటూ తెలిపాడు సురేష్ రైనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: