మన్కడింగ్ : ఆ అవసరం ఏముంది.. రవి శాస్త్రి షాకింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి క్రికెటర్ కూడా అటు ఐసీసీ రూల్స్ ప్రకారమే క్రికెట్ ఆడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఐసీసీ నిబంధనల్లో కొనసాగుతున్న ఒక రూల్ అంతర్జాతీయ క్రికెట్లో తెగ చర్చనీయాంశంగా మారిపోయింది అదే మన్కడింగ్  విధానం. బౌలర్ బంతిని వేయడానికి ముందే ఇక నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజు వదిలి ముందుకు వెళితే రూల్ ప్రకారం ఇక బ్యాటర్ను రనౌట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత బౌలర్ దీప్తి శర్మ కూడా ఇలాంటి మన్కడింగ్ చేసి వార్తల్లో నిలిచింది. ఐసీసీ రూల్ ప్రకారం మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసినప్పటికీ.. ఇక క్రీడా స్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారు అంటూ ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు ఆయా క్రికెటర్ల పై విమర్శలు చేస్తూ ఉండడం కూడా ఇటీవల కాలంలో చూశాము.  ఇకపోతే ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండడం గమనార్హం. కాగా టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి సైతం ఈ విషయంపై స్పందించాడు.

 బౌలర్ బంతిని వెయ్యక ముందే నాన్ స్ట్రైకర్ క్రీజు వదిలి బయటకు రావాల్సిన అవసరం లేదని రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. ఒకవేళ బ్యాటర్ అలా క్రీజు వదిలి బయటకు వెళ్తే అప్పుడు చేసే రన్ అవుట్ ను క్రీడా స్ఫూర్తిగా విరుద్ధమంటూ ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఫీల్డర్ కి కూడా ఇలాంటి కండిషన్ పెడతారా.. ఒకసారి క్యాచ్ వదిలేయ్.. మరోసారి పట్టుకో అని చెబుతారా అంటూ ప్రశ్నించాడు రవి శాస్త్రి. బంతి వేయకముందే బ్యాటర్ క్రీజు దాటి ముందుకు వెళ్తే పరుగు కోసం అడ్వాంటేజ్ తీసుకున్నట్లే అవుతుంది. ఇలా జరిగితే బ్యాటర్ ను ముందుగా హెచ్చరించాల్సిన అవసరంలేదు అంటూ చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: