ఉత్కంఠ పోరులో ఓడిన నమీబియా... కన్నీటి వీడ్కోలు !

VAMSI
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ 2022 రసవత్తరంగా మారింది. సూపర్ 12 కు చేరుకోవడానికి జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండు గ్రూప్ లుగా మొత్తం ఎనిమిది జట్లు నాలుగు స్థానాల కోసం పోటీ పడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు గ్రూప్ ఏ లో భాగంగా జరిగిన ఉదయం మ్యాచ్ లో శ్రీలంక మరియు నెదర్లాండ్ జట్లు తలపడ్డాయి.. అందులో చివరివరకు పోరాడిన నెదర్లాండ్ ఓటమి పాలయింది. దీనితో శ్రీలంక 12 సూపర్ కు చేరుకుంది. ఇక ఖచ్చితంగా నెదర్లాండ్ సూపర్ 12 కు దూసుకువెళ్లాలంటే నమీబియా యూఏఈ తో ఓడిపోవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ ను నెదర్లాండ్ ప్లేయర్స్ మరియు అభిమానాలు దగ్గరుండి మరీ చూస్తున్నారు.
చివరికి నెదర్లాండ్ ఆశించిన విధంగానే యూఏఈ చేతిలో నమీబియా ఓటమై పాలయింది. యూఏఈ మ్యాచ్ గెలిచినా నమీబియా మాత్రం అభిమానుల మనసును గెలుచుకుంది. ఎందుకంటే అద్భుతంగా పోరాడి ఈ మ్యాచ్ ను గెలిచేంత పని చేసింది నమీబియా. కేవలం... 69 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీనియర్ ప్లేయర్ డేవిడ్ వైజ్ మరియు ట్రంప్ల్ మాన్ తో కలిసి మ్యాచ్ ను దగ్గరగా తీసుకు వెళ్ళాడు. ఆఖరి ఓవర్ లో 14 పరుగులు చేయాల్సిన సమయంలో జహూర్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో నమీబియా ఓటమి ఖరారయింది.
యూఏఈ ఈ గెలుపుతో మూడు మ్యాచ్ లలో ఒకరు గెలిచి కాస్త సంతోషంతో టోర్నీని వీడింది. ఇక నమీబియా మాత్రం శోకతప్త హృదయాలతో ఈ వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది. ఆ విధంగా గ్రూప్ ఏ నుండి శ్రీలంక మరియు నెదర్లాండ్ లు సూపర్ 12 కు చేరుకున్నారు. దీనితో నెదర్లాండ్ సూపర్ 12 లో గ్రూప్ 2 లో నిలిచింది. శ్రీలంక మాత్రం గ్రూప్ 1 లో స్థానాన్ని సాధించింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: