టి20 వరల్డ్ కప్.. మూడేళ్ల తర్వాత అతను శ్రీలంక జట్టులోకి?

praveen
ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఓడిపోయి అభిమానులందరికీ షాక్ ఇచ్చింది శ్రీలంక జట్టు  ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సూపర్ 12 మ్యాచ్ల కోసం అర్హత సాధించింది. అయితే శ్రీలంక జట్టు సూపర్ 12 మ్యాచ్లకు అర్హత సాధించింది అనే ఆనందం ఉన్నప్పటికీ జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ దూరమవుతున్నారు అన్న ఆందోళన మాత్రం జట్టు యాజమాన్యాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని చెప్పాలి.

 కొన్ని రోజుల నుంచి మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లుగా కొనసాగుతున్న ప్లేయర్స్ అందరూ కూడా వరుసగా గాయాల బారిన పడుతూ చివరికి జట్టుకు దూరమవుతున్నారు. కొంతమంది కొన్ని మ్యాచ్లకు దూరమవుతుంటే కొంతమంది మాత్రం ప్రపంచ కప్ మొత్తానికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ టి20 ప్రపంచ కప్ సూపర్ 12 మ్యాచ్లు ప్రారంభం కావడానికి ముందే గుణతిలక, చమీరా, దిల్షాన్ మధుశంక లాంటి కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. అదే సమయంలో యూఏఈ తో జరిగిన మ్యాచ్లో గాయపడిన ఫేసర్ ప్రమోద్ మధుషాన్ కూడా వరల్డ్ కప్ లో ఆడతాడా లేదా అన్నది అనుమానంగా కనిపిస్తుంది.


 ఇకపోతే దుష్మంత చమీరా స్థానంలో కసూన్ రజితను శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టులోకి తీసుకుంది. అయితే సదరు ప్లేయర్ 2019లో శ్రీలంక జట్టు తరఫున టీ20 లలో ఆడాడు. ఇక అప్పటి నుంచి శ్రీలంక జట్టు తరఫున అవకాశం దక్కించుకోలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు జాతీయ జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. అది కూడా ఎంతో ఒత్తటితో కూడుకున్న వరల్డ్ కప్ లో జట్టుతో కలిసి ఆడబోతున్నాడు. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: