ఈ వయసులో అది అంత సులభం కాదు.. డీకే పై రికీ పాంటింగ్ కామెంట్?
నేటి రోజుల్లో యువ ఆటగాళ్ల నుంచి పోటీ పెరిగిపోయిన నేపథ్యంలో ఇక క్రికెట్లో స్టార్లుగా కొనసాగుతున్న వారు మాత్రం ఎప్పటికప్పుడు తమని తమను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఇక జట్టుకు దూరమై ఏళ్లు గడుస్తున్న సీనియర్ ఆటగాళ్లు మళ్ళీ పునరాగమనం చేయడం మాత్రం అసాధ్యమైన విషయం. కానీ ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ 37 ఏళ్ల వయసులో జట్టులోకి రిఎంట్రీ ఇచ్చాడు దినేష్ కార్తీక్. ఐపీఎల్లో అదరగొట్టి.. అతన్ని సెలెక్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేని పరిస్థితిని బీసీసీఐకి తీసుకువచ్చాడు.
జట్టులోకి వచ్చిన తర్వాత తనతైన ప్రదర్శనతో ఏకంగా టీమిండియాను వేధిస్తున్న ఫినిషెర్ పాత్రను తాను తీసుకున్నాడు అని చెప్పాలి. వరల్డ్ కప్ లో కూడా చోటు తగ్గించుకుని అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవల దినేష్ కార్తీక్ ప్రతిభ పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత టి20 బెస్ట్ ఫినిషర్లలో దినేష్ కార్తీక్ ఒకడని ఆకాశానికి ఎత్తేసాడు. అతని కెరియర్ ముగిసింది అనుకుంటున్న సమయంలో అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చాడు. కోల్కతా కూడా అతని రిటైన్ చేసుకోలేదు. అలాంటిది కామంటేటర్ నుంచి మళ్లీ క్రికెటర్ అవతారం ఎత్తాడు. అతని రీ ఎంట్రీ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ వయసులో అది అంత సులభమైనది కాదు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.