పాకిస్తాన్ తో మ్యాచ్.. ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరు?

praveen
టి20 వరల్డ్ కప్ ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమైనప్పటికీ అసలు సిసలైన సూపర్ 12 మ్యాచ్లు మాత్రం నేటి నుంచే జరగబోతున్నాయి అని చెప్పాలి. నేటి నుంచి సూపర్ 12 మ్యాచ్ లు జరుగుతున్న అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మ్యాచ్ మాత్రం రేపు జరగబోతుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ మధ్య తొలి పోరు ఉత్కంఠ భరితంగా క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైర్మెంట్ అందించడం పక్క అన్నది ప్రస్తుతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ మ్యాచ్ లలో మునిగి తేలిన టీమిండియా ఇక ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను సమర్థవంతంగా ఢీకొట్టేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలోనే ఇక ఒక చర్చకు మాత్రం ఇప్పటికి ఆన్సర్ దొరకలేదు అని చెప్పాలి. అదే తుదిచెట్టులో దినేష్ కార్తీక్ చోటు సంపాదించుకుంటాడా లేకపోతే రిషబ్ పంత్ జట్టులోకి వస్తాడా అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఈ విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు.


 కొంత మంది పంత్ జట్టులో ఉండాలని కోరుకుంటూ ఉంటే.. ఇంకొంత మంది దినేష్ కార్తీక్ అయితే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ విషయం పై ఇప్పటికి కూడా ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇక రేపే భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యం లో ఇక ఈ మ్యాచ్లో తుది జట్టు లో దినేష్ కార్తీక్ ఉంటాడా లేకపోతే పంత్ చోటు సంపాదించుకుంటాడ అనే విషయంపై మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ తుదిచెట్టులో ఎవరుంటారని మీరు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: