వరల్డ్ కప్ : ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టాడు?
అంతేకాదు టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో రికార్డులు బద్దలవుతాయని.. ఇక ఎంతో మంది ఆటగాళ్లు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారు అన్న విషయం కూడా ముందుగానే ఊహించారు క్రికెట్ అభిమానులు. అందరూ అనుకున్నట్లుగానే నేటి నుంచి ప్రారంభమైన సూపర్ 12 మ్యాచ్ లలో భాగంగా మొదటి మ్యాచ్ నుంచి ఎన్నో రికార్డులు కొట్టడం మొదలుపెట్టారు ప్లేయర్లు. ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఒక ప్రపంచ రికార్డు నమోదయింది అని చెప్పాలి.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు కివిఎస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫేసర్ టిమ్ సౌదీ అరుదైన ఘనత సాధించాడు. ఇటీవల వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో వార్నర్ వికెట్ తీసిన టిమ్ సౌదీ టి20 అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు 101 మ్యాచ్ లు ఆడిన టిమ్ సౌదీ మొత్తం 125 వికెట్లు తీశాడు అని చెప్పాలి. అంతకుముందు అత్యధిక వికెట్లు 122 రికార్డు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షేకీబుల్ హసన్ పేరిట ఉండగా.. ఇప్పుడు ఈ రికార్డు టిమ్ సౌదీ బద్దలు కొట్టాడు.