నాకు, రోహిత్ కి దగ్గర పోలికలున్నాయి : కోహ్లీ
ఇలా క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం నిరీక్షణగా ఎదురు చూసేలా చేసిన దాయాదుల సమరానికి నేడు సమయం ఆసన్నమైంది. మరి కొన్ని గంటల్లో పాకిస్తాన్ భారత్ మధ్య హోరాహోరీ పోరు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. మేల్బోర్న్ వేదికగా జరగబోతున్న ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అని చెప్పాలి.. ఇక ఈ మ్యాచ్ కి ముందే టీమిండియా కీలక ఆటగాళ్లు మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి.
వేలాది మంది అభిమానుల మధ్య పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటం తనకు ఇష్టం అంటూ కోహ్లీ తెలిపాడు. ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ వరల్డ్ కప్ అంటేనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఆటగాడికి ఆ అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. పెద్ద టోర్నమెంట్లలో లోపాలను అధిగమించి జట్టును విజయపతంలో నడిపించేందుకు రోహిత్ నేను ప్రయత్నిస్తాం. అయితే చాలా విషయాల్లో కూడా మాకు దగ్గర పోలికలు ఉన్నాయి. మిగతా ఆటగాళ్ల సహచర్యం ఎంతో అద్భుతం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం తమజట్టు ఆటగాళ్లందరూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అంటూ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.