ఇండియా vs పాకిస్తాన్.. పిచ్ రిపోర్ట్ ఏంటంటే?

praveen
ఈనెల 16వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభమైంది . మొన్నటివరకు ఇక అటు క్వాలిఫైయర్ మ్యాచ్లు ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగాయ్. ఇక నిన్న సూపర్ 12 లో భాగంగా రెండు మ్యాచ్లు జరిగాయి. కానీ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు మాత్రం ఈ మ్యాచ్లు ఏవి కూడా అసలు సిసలైన కిక్ ఇవ్వలేదు. అయితే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే కిక్కిచ్చే మ్యాచ్ మాత్రం నేడు జరగబోతుంది అని చెప్పాలి. అదే భారత్ పాకిస్తాన్ మ్యాచ్. ఇప్పటినుంచి కాదు దశాబ్దాల నుంచి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కి ఊహించని రేంజ్ లో క్రేజీ ఉంది అని చెప్పాలి.

 ఇరుజట్లు మైదానంలో పోటీ పడుతూ ఉంటే అటు స్టేడియంలో ఉండే ప్రేక్షకులలో ఉండే ఉత్కంఠ మాటల్లోచే వర్ణించడం చాలా కష్టం అనే చెప్పాలి. అందుకే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ని హై వోల్టేజ్ మ్యాచ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు.. కాగా నేడు ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియాలోని మేల్ బోర్న్ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ ఆడబోతున్నాయి పాకిస్తాన్, భారత్ జట్లు. ఈ దాయాదుల సమయాన్ని చూసేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం సిద్ధమైంది. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి ఈ దాయాదులు పోరుకు వరుణ గండం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.

 ఇకపోతే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోయే మెల్బోర్న్ స్టేడియంలో పిచ్ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం.. సాదరణంగా ఆస్ట్రేలియా పిచ్ లు ఫేస్ బౌలింగ్ కూ స్వర్గధామం అని చెప్పాలి. అదే సమయంలో బ్యాటింగ్ కి కూడా అనుకూలంగానే ఉంటాయి. గత కొన్ని రోజుల నుంచి మేల్ బోర్న్ లో వర్షం కురుస్తున్న కారణంగా పిచ్ పై బౌలింగ్కు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే  టాస్ నెగ్గిన జట్టు ముందుగా బౌలింగ్ ని ఎంచుకోవడం ఖాయం అనేది తెలుస్తుంది. ఇక పిచ్ మీద తడి అడ్వాంటేజ్ తీసుకునేందుకు బౌలర్లు తప్పకుండా ఆసక్తి చూపుతారు అన్నది తెలుస్తుంది. స్వింగ్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసే షమీ, భువనేశ్వర్, హార్దిక్ లు ఇక ఈ పరిస్థితులను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: