టి20 ఫార్మాట్ లో.. చివరి 3 ఓవర్లలో ఎక్కువ రన్స్ చేసిన జట్లు ఇవే?
అయితే టి20 ఫార్మాట్లో ఉండే 20 ఓవర్లలో అన్ని ఓవర్లలో ఎలాంటి పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ ను డిసైడ్ చేసేది మాత్రం డెత్ ఓవర్లుగా పిలుచుకునే చివరి మూడు ఓవర్లు అని చెప్పాలి. ఈ డెత్ ఓవర్లలో అటు బ్యాట్స్మెన్ పై ఎంత ఒత్తిడి ఉంటుందో బంతి వేసే బౌలర్ పై కూడా అంతే ఒత్తిడి ఉంటుంది అని చెప్పాలి. భారీ సిక్సర్లు కొట్టడానికి బ్యాట్స్మెన్లు. పరుగులు కట్టడి చేయడం కోసం బౌలర్లు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. ఇక ఇలా డెత్ ఓవర్లలో పరుగులు చేయాలన్న లేదా వికెట్లు తీయాలన్నా కేవలం అనుభవజ్ఞులకు మాత్రమే సాధ్యమవుతుంది.
ఇక ఈ మూడు ఓవర్లే మ్యాచ్ ఎటువైపు వెళ్ళాలి అన్నది డిసైడ్ చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.. ఇకపోతే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో భారత్ ఆడిన మ్యాచ్లో చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేసింది టీమిండియా. కాగా చివరి మూడు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసిన జట్టు ఏది అన్నది హాట్ టాపిక్ మారిపోయింది. కాగా 2010లో పాకిస్తాన్ పై 48 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఇక 2014లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా పై 42 పరుగులు చేసింది. 2010లో ఇండియా పై శ్రీలంక జట్టు 41 పరుగులు చేసింది అని చెప్పాలి. ఇలా ఈ నాలుగు జట్లు కూడా చివరి మూడు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసిన జట్లుగా కొనసాగుతున్నాయి.